రామ్ చరణ్ ఫై ప్రశంసలు కురిపించిన జేమ్స్ కామెరాన్

వరల్డ్ ఫేమస్ డైరెక్టర్, అవతార్ ఫేమ్ జేమ్స్ కామెరాన్..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫై ప్రసంశలు కురిపించడంతో మెగా అభిమానులతో పాటు సినీ లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సాంగ్ ఆస్కార్ బరిలో నిలువడం ఫై దేశ వ్యాప్తంగా అంత ప్రసంశలు కురిపిస్తూ..ఖచ్చితంగా నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ వస్తుందని భావిస్తున్నారు. ఈ తరుణంలో హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కామెరాన్ ఆర్ఆర్ఆర్ పై, అలాగే రామ్ చరణ్ నటన ఫై ప్రసంశలు కురిపించడం మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది. ఈ మూవీ లో రామ్ క్యారెక్టర్ ఎంతో సవాల్ తో కూడుకున్నదని జేమ్స్ కామెరాన్ చెప్పుకొచ్చారు.

జేమ్స్ కామెరాన్ కామెంట్స్ ఫై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. “జేమ్స్ కామెరాన్ సర్… మీ అంతటి గ్లోబల్ ఐకాన్, సినిమా మేధావి ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ ను పొగడడం ఆస్కార్ అవార్డు కంటే తక్కువేమీ కాదు. రామ్ చరణ్ కు ఇదొక గొప్ప గౌరవం. రామ్ చరణ్ ఈ స్థాయికి ఎదగడాన్ని ఓ తండ్రిగా గర్వంగా భావిస్తున్నా. మీ ప్రశంసలు రామ్ చరణ్ భవిష్యత్ ప్రాజెక్టులకు దీవెనలు” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.