ఆస్కార్ రేస్ లో ‘జల్లికట్టు’

అధికారిక ప్రకటన

'Jallikattu' in Oscar race
‘Jallikattu’ movie

ఈ ఏడాది కూడా ఆస్కార్ రేసుకు ఇండియన్ సినిమాలు రెడీ అయ్యాయి. ఇప్పటికి పలు సార్లు మలయాళం మూవీస్ ఆస్కార్ నామినేషన్ కు పోటీ పడ్డాయి.

ఈసారి మలయాళి మూవీ జల్లికట్టుకు ఆస్కార్ నామినేట్ అయ్యింది. 2021 ఆస్కార్ రేసులో జల్లికట్టుకు స్థానం కల్పిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

మొత్తం 27 సినిమాలతో ఈ సినిమా పోటీ పడి ఈ ఎంట్రీని దక్కించుకుంది.

లిజో జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఒక దున్నపోతు ను వేటాడే క్రమంలో గ్రామంలో ఏం జరిగింది అనేది చూపించారు.

మాసం కోసం దున్నపోతును చంపేందుకు ప్రయత్నిస్తు ఉండగా అది తప్పించుకుని ఊరిని మొత్తం నాశనం చేస్తుంది. కొందరి ప్రాణాలను సైతం తీస్తుంది.

దాన్ని పట్టుకునేందుకు జరిగే పోరాటలను చాలా సహజంగా దర్శకుడు చూపించాడు. ఈ సినిమాను జల్లికట్టు అనే టైటిల్ తో ఆహాలో డబ్బింగ్ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/