ఐదేళ్ల పాటు నిధులు బదిలీ చేయాల్సిందే..!
ప్రభుత్వానికి జలాన్ కమిటీ సిఫారసులు?

ముంబయి: కేంద్ర ప్రభుత్వం నియమించిన బిమల్‌జలాన్ కమిటీ రిజర్వుబ్యాంకు మిగులు నిధులను నామమాత్రంగా మూడునుంచి ఐదేళ్లపాటు ప్రభుత్వానికి బదిలీచేయాలనిసూచించింది. రిజర్వుబ్యాంకు ఆర్ధిక మూలధన క్రమానికి సంబంధించి కాలానుగతంగాసమీక్షలునిర్వహించాలని సూచించినట్లు సమాచారం. అయితే ప్రభుత్వం లోటు కట్టడికి ఆర్బిఐ మిగులు నిధులను కొంతమాత్రంగా అయినా మూడునుంచి ఐదేళ్లపాటు పంపించాల్సి ఉంటుందని జలాన్ కమిటీసూచించింది. ఆర్ధికలోటు కట్టడికోసం ఆర్బిఐ వద్ద ఉన్న మూడులక్షలకోట్ల మిగులునిధులనుప్రభుత్వానికి మళ్లించాలన్న ప్రతిపాదనలపైనే తీవ్రస్థాయి విమర్శలు, వాడివేడి వాదనలు జరిగాయి.
దీనిపై ప్రభుత్వం మాజీ గవర్నర్ బిమల్‌జలాన్ ఆధ్వర్యంలో ఒక ప్యానెల్‌ను నియిమంచి నివేదిక ఇవ్వాలనికోరింది. దశలవారీగా కొంతమొత్తం అయిన ఆప్రభుత్వానికి బదిలీచేయాల్సి ఉంటుందని సూచించింది. అంతేకాకుండా ఇపుడున్న డివిడెండ్ పంపిణీకి తోడు మిగులునిధుల బదిలీ కూడా ఉండాలనిసూచించింది. అయితే కమిటీలో ఉన్న సభ్యులు ఏకాభిప్రనాయం లేదని, కొందరు మాత్రమే ఈ సూచనలు చేసినట్లు తేలింది. ఈ నివేదికలు ఆర్బిఐ గవర్నర్ శక్తికాంతదాస్‌కు అందచేస్తారని తర్వాత ఆర్బిఐ సెంట్రల్ బోర్డు ఈ నివేదికను పరిశీలిస్తుందని తేలింది. ఆర్ధికశాఖ కార్యదర్శి సుభాష్‌చంద్ర గార్గ్ అసమ్మతి తెలిపిన నోట్‌ను కూడా ఈ నివేదికలో పొందుపరిచారు. జలాన్ప్యానెల్ ఆర్బిఐ ఆర్ధిక మూలధనవనరుల వివరాలను ఎప్పటికప్పుడు సమీక్షచేయాలనినిర్ణయించారు. ఇప్పటివరకూ ఆర్బిఐ డివిడెండ్రూపంలోనే నిధులు బదిలీచేస్తోంది.
2016-17లో 65,876 కోట్లు, 20170-18లో 40,659 కోట్లు, 2018-19లో 68వేల కోట్లు, 2019-120ఆర్ధికసంవత్సరాల్లో 90వేల కోట్లను డివిడెండ్రూపంలోప్రభుత్వానికి బదిలీచేసింది. ఈ మొత్తంలో తాత్కాలిక డివిడెండ్ 28వేల కోట్లుకూడా ఉన్నాయి. బడ్జెట్ రాబడుల్లో ఆర్‌బిఐనుంచి డివిడెండ్లు, జాతీయ బ్యాంకులు, ఇతర ఆర్ధికసంవత్సలనుంచి వచ్చే డివిడెండ్ 23,130 కోట్లనుంచి 1.06 లక్షలకోట్లకు చేరింది. తాత్కాలిక బడ్జెట్లో పొందుపరిచినమొత్తం కంటే ఈ డివిడెండ్మొత్తం లక్షకోట్లుద ఆటింది. మొత్తం మీద ఆర్బిఐ స్వయంప్రతిపత్తిపై ప్రభుత్వ నజర్ ఎక్కువ ఉందన్నది జలాన్ కమిటీ సిఫారసులు స్పష్టంచేస్తున్నాయి.
వార్త ఈ పేపర్ కోసం క్లిక్ చేయండి: https://epaper.vaartha.com/