అమెరికాకు మంత్రి జైశంకర్‌ విజ్ఞప్తి

మా దేశం ప్రతిభావంతులకు ఆటంకాలు కల్పించొద్దు

jaishankar
jaishankar

వాషింగ్టన్‌: తమ దేశం నుంచి వచ్చే ప్రతిభావంతులకు ఆటంకాలు సృష్టించొద్దని అమెరికాకు భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ విజ్ఞప్తి చేశారు. భారతీయ ఐటీ నిపుణుల కోసం జారీ చేసే హెచ్‌1బీ వీసాలు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో భాగమన్నారు. అమెరికా విదేశాంగ, రక్షణశాఖల మంత్రులు మైక్‌ పాంపియో, మార్క్‌ ఎస్సర్‌లతో భారత రక్షణ, విదేశాంగ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, జైశంకర్‌ మలి విడుత ముఖాముఖీ(2+2) చర్చల్లో పాల్గొన్నారు. మరో వైపు 370 అధికరణాన్ని రద్దు చేసిన తర్వాత కశ్మీర్‌ లోయలో ఆంక్షలను ఎత్తేయాలని కోరుతూ అమెరికా కాంగ్రెస్‌లో ప్రమీలా జయపాల్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆమె సభ్యురాలిగా ఉన్న ఓ కమిటీతో సమావేశానికి జైశంకర్‌ నిరాకరించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/