ఇన్వెస్టర్లకోసం జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌!

Tata Group
Tata Group

న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న టాటాగ్రూప్‌ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌లో అర్హులైన ఇన్వెస్టర్లకోసం అన్వేషణ ముమ్మరం చేసింది. ఇప్పటికే గీలీ, బిఎండబ్ల్యు వంటి భారీ లగ్జరీకార్ల తయారీ కంపెనీలను సంప్రదించింది. బ్రిటిష్‌ ఆటో తయారీ సంస్థకు ఆర్థిక పరమైన సమస్యలు ఎక్కువయ్యాయి. టాటాగ్రూప ్‌ఆధ్వర్యంలోనే జెఎల్‌ఆర్‌ నడుస్తోంది. చైనాలోని జెజియాంగ్‌ గీలీ హోల్డింగ్‌గ్రూప్‌కంపెనీ, బిఎండబ్ల్యు ఎజి కంపెనీలు భాగస్వామ్యంకోసం ఇప్పటికే సంప్రదింపులు జరిపింది. బ్రిటన్‌లోనేకాకుండా ఇతరదేశాల్లో కూడా అమ్మకాలు తగ్గడంవల్ల జెఎల్‌ఆర్‌కు ఆర్థిక సంక్షోభం వెన్నాడుతోంది. చైనా ఆటోతయారీ సంస్థలతో టైఅప్‌ ఉంటే కొంతమేర రికవరీ అవుతుందని అంచనా. 3.9 బిలియన్‌ డాలర్ల నష్టం ఈ ఏడాది వస్తున్నది. బ్రిటిష్‌ లగ్జరీ కార్ల తయారీ, జర్మనీకి చెందిన బిఎండబ్ల్యు సంస్థలను కూడా కంపెనీ సంప్రదించింది. ఎలక్ట్రిక్‌ టెక్నాలజీతో జర్మనీ కార్ల తయారీ సంస్థనుసైతం సంప్రదించిందని సమాచారం.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/