జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ డ్రైవర్‌ రహిత విద్యుత్‌ కారు

jaguar land rover
jaguar land rover

కోవెంట్రీ: టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ (జెఎల్‌ఆర్‌) డ్రైవర్‌ రహిత విద్యుత్‌ కారును ఆవిష్కరించింది. సెంట్రల్‌ ఇంగ్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ వార్విక్‌ వద్దనున్న తన నూతన ఇన్నోవేషన్‌ సెంటర్‌లో దీన్ని కంపెనీ అభివృద్ధి చేసింది. దీన్ని ప్రాజెక్టు వెక్టార్‌గా కంపెనీ చెబుతోంది. ఇది మరింత అడ్వాన్స్‌డ్‌, ఫ్లెక్సిబుల్‌, మల్టీ యూజ్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ అని పేర్కొంది. సమాజాన్ని మరింత సురక్షితంగా, ఆరోగ్యవంతంగా, పర్యావరణాన్ని పరిశుద్ధంగా ఉంచే ఇన్నోవేషన్లలో జేఎల్‌ఆర్‌ లీడర్‌గా ఉంటుందని మరోసారి ప్రాజెక్టు వెక్టార్‌ నిరూపించిందని కంపెనీ సీఈఓ రాల్ఫ్‌ స్పెత్‌ తెలిపారు. కాగా 15 కోట్ల పౌండ్లతో ఏర్పాటు చేసిన జెఎల్‌ఆర్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ప్రిన్స్‌ చార్లెస్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఇది యూరప్‌లో అతిపెద్ద ఆటోమెటివ్‌ ఆర్‌ ఆండ్‌ డీ సెంటర్‌.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/