క్యాన్సర్‌కు ఉచిత చికిత్స ఇవ్వండి ..

jaggareddy
jaggareddy

హైదరాబాద్‌: సంగారెడ్డి ఎమ్మెల్యె జగ్గారెడ్డి క్యాన్సర్‌కు ఉచిత చికిత్స అందించాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు. క్యాన్సర్‌ వల్ల ప్రజలు ఎక్కువగా చనిపోతున్నారని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. క్యాన్సర్‌కు చికిత్స చాలా ఖరీదుతో కూడుకున్నది కాబట్టి క్యాన్సర్‌ భారిన పడిన రోగులు చికిత్సలు చేయించుకునే పరిస్థితులో లేరు. కావునా అన్ని జిల్లా ఆసుపత్రులలో క్యాన్సర్‌కు సంబంధించిన నిర్దారణ పరీక్షలు చేయించుకొవడానికి అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఒక సారి క్యాన్సర్‌ భారిన పడితె ఆస్తులు అమ్మినా క్యాన్సర్‌ రోగం తగ్గటంలేదు. కావునా అన్ని కార్పోరేట్‌ ఆసుపత్రులలో క్యాన్సర్‌కు సంబంధించిన వ్యాదులకు ఉచితంగా చికిత్సలు చేయించేలా చర్యలు తీసుకొవాలని సీఎం కెసిఆర్‌ని మరియు ప్రధాని నరేంద్ర మోడీని తన లేఖ ద్వారా కోరారు. ఈ విషయం పై సీఎం ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నాని ఆయన అపాయింట్‌మెంట్‌ ఇస్తే వెల్లి కలుస్తానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఇది ఒక సంగారెడ్డి సమస్య కాదని దేశ వ్యాప్తంగా ఉందని కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్యాలు తగిన చర్యలు తీసుకొవాలని కోరారు.
తాజా బిజినెస్‌ వార్తలకోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/