రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పిన జగ్గారెడ్డి

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి..టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి క్షమాపణలు చెప్పారు. శుక్రవారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ పీసీసీ అధ్యక్షుడు కాకముందే తాను మూడు సార్లు ఎమ్మెల్యేని అయ్యానంటూ మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ పార్టీనా..? ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా అంటూ ఓ రేంజ్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ సీనియర్లతో చర్చించకుండానే రెండు నెలల కార్యాచరణ ఎలా ప్రకటిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ తరుణంలో జగ్గారెడ్డి ఫై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా సీరియస్ అయ్యింది.

రంగంలోకి దిగిన అధిష్టానం.. జగ్గారెడ్డి, రేవంత్ మధ్య వివాదం ముగిసేలా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే జగ్గారెడ్డి కి సర్ది చెప్పారు ఏఐసీసీ ఇంచార్జి కార్య దర్శలు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్. అనంతరం నిన్నటి ఘటన పై వివరణ ఇచ్చారు జగ్గారెడ్డి. అంతర్గత విషయాలను మీడియా ముందు మాట్లాడటం పై సారి చెప్పారు జగ్గారెడ్డి.. నిన్నటి ఘటనను మరిచిపోవాలని.. అంతర్గత విషయాలు బయట మాట్లాడటం తన తప్పేనని పేర్కొన్నారు జగ్గారెడ్డి. మరోసారి ఇలాంటి తప్పులు జరగవని అన్నారు.