బ్రేకింగ్ : కాంగ్రెస్ పార్టీ కి జగ్గారెడ్డి షాక్..ఐదు రోజుల్లో రాజీనామా

jaggareddy

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక ప్రకటన చేసారు. ఐదు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కి , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నట్లు తెలిపి షాక్ ఇచ్చాడు. గత వారం రోజులుగా మీడియా లో , సోషల్ మీడియా లో జగ్గారెడ్డి పేరు తెగ ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే.

నిన్న పీఏసి సమావేశం వాడివేడిగా జరిగింది. ఈ తరుణంలో జగ్గారెడ్డి పార్టీ కి , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని..సంగారెడ్డి లో కాంగ్రెస్ సత్తా ఏంటో తేల్చుకోవాలని సవాల్ విసిరినట్లు తెలుస్తుంది. జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలతో పలువురు కాంగ్రెస్ నేతలు ఆయన్ను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ జగ్గారెడ్డి మాత్రం తగ్గడం లేదు. ఖచ్చితంగా రాజీనామా చేస్తానని చెపుతున్నాడు.