సూట్లో జగ్గారెడ్డి లుక్ కేక

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎలా ఉంటారనేది అందరికి తెలిసిందే. భారీ జుట్టు తో ఒక బాబాలా.. రుషిలా కనిపిస్తుంటారు. అలాగే మీడియా ముందు కూడా ఫైర్ ఫైర్ గా కనిపిస్తుంటారు. అలాంటి జగ్గారెడ్డి తాజాగా సూట్లో జెంటిల్మన్ లుక్ ..ఓ ఫ్రొఫెషనల్ కార్పొరేట్ బాస్ లా కనిపించి అందరికి షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి. నిజంగా జగ్గారెడ్డి నా అని అంత ఆశ్చర్యపోతున్నారు.

తాజాగా హైదరాబాద్లోని ఓ బట్టల షో రూమ్ కు వెళ్లిన జగ్గారెడ్డి..రెండు ఫార్మల్ బ్లేజర్లను కొనుగోలు చేసినట్టు ఫొటోలను బట్టి తెలుస్తోంది. బ్లూ బ్లేజర్లో జగ్గా రెడ్డి నిజమైన వ్యాపారవేత్తగా కనిపించాడు. సడెన్ గా ఈయన ఫార్మల్స్ దుస్తులు ధరించడానికి కారణం ఏమయ్యి ఉంటుందో అని మాట్లాడుకుంటున్నారు. రీసెంట్ గా జగ్గారెడ్డి శశిధర్ పార్టీ మార్పు ఫై స్పదించడం జరిగింది. శశిధర్ రెడ్డి పార్టీ మారితే కాంగ్రెస్‌కు నష్టమని అభిప్రాయం వ్యక్తం చేశారు. మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారితే దానికి పూర్తి బాధ్యత టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలదేనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

తమ పార్టీలో ఇబ్బంది ఉందని, పీసీసీ, సీఎల్పీ సమన్వయం చేయాలని సూచించారు. ఈ సందర్బంగా రేవంత్ ఫై కూడా జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. పాదయాత్రలో వన్‌మ్యాన్ షో చేస్తే ఎలా? అంటూ రేవంత్‌ను ఉద్దేశించి సీరియస్ అయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్లను సమన్వయం చేయకపోవడం పీసీసీ తప్పేనని వ్యాఖ్యానించారు.