రాహుల్ తో భేటీ అనంతరం జగ్గారెడ్డి ఏమన్నారంటే..

గత కొద్దీ రోజులుగా జగ్గారెడ్డి వ్యవహారం టి కాంగ్రెస్ లో హలజడి సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టిన దగ్గరి నుండి రేవంత్ నిర్ణయాలను జగ్గారెడ్డి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఒకానొక సమయంలో కాంగ్రెస్ పార్టీ కి , మ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖను సైతం రాహుల్ కు పంపించడం జరిగింది. అంతే కాదు జగ్గారెడ్ట్ తెరాస లో చేరడం ఖాయం అన్నట్లు కూడా వార్తలు ప్రచారం జరిగాయి. ఈ క్రమంలో సోమవారం రాహుల్ తో కాంగ్రెస్ నేతలు భేటీ కావడం , అందులో జగ్గారెడ్డి కూడా ఉండడం తో ఏంజరుగుతుందో అని అంత ఆసక్తి గా చూసారు. కానీ రాహుల్ భేటీ తర్వాత ఎవరు కూడా జగ్గారెడ్డి ఇష్యూ గురించి మాట్లాడలేదు.

ఇక ఈరోజు బుధువారం జగ్గారెడ్డి తన ఫ్యామిలీ తో కలిసి రాహుల్ తో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత జగ్గారెడ్డి ఏమాట్లాడతారో..ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తాడో అనుకున్నారు కానీ జగ్గారెడ్డి మాత్రం చాల సింపుల్ గా అంత కూల్..అనేశాడు. ఇకపై బహిరంగ విమర్శలు ఉండవు.. మీరు కూడా చూడరు అని వెల్లడించారు.. పార్టీలో ఇప్పుడు సమస్యలే లేవని పేర్కొన్నారు జగ్గారెడ్డి.. నా కుటుంబ సభ్యులతో కలిసి రాహుల్ గాంధీని కలవాలని ఎప్పటినుంచో అనుకున్నాను.. అది ఈరోజు కుదిరిందన్నారు. రాజకీయాల కంటే ముందు మా పిల్లల చదువుల గురించి అడిగారని తెలిపారు.