సిఎం కెసిఆర్‌ మంచి పాలన అందిస్తారని ఆశిస్తున్నా

కాంగ్రెస్‌ ఎమ్మెల్యె జగ్గారెడ్డి

Jagga Reddy
Jagga Reddy

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కాంగ్రెస్‌ ఎమ్మెల్యె జగ్గారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సిఎం కెసిఆర్‌కు సంగారెడ్డి ఎమ్మెల్యె జగ్గారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆరోగ్యంగా ఉండి మంచి పాలన అందిచాలని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. ఎన్నికల హామీలు ఇంకా ఎందుకు నెరవేర్చలేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. రైతు రుణమాఫీ ఇప్పటి వరకు ఇవ్వలేదని, రాష్ట్రంలో అవినీతి లేకుండా చేస్తానన్నారని, తెలంగాణ అవినీతి లేని రాష్ట్రంగా ఉందా? అని ప్రశ్నించారు. అక్ష్యరాస్యతలో తెలంగాణ దేశంలో 13వ స్థానంలో ఉండటం బాధాకరమన్నారు. ప్రభుత్వ పాఠశాలలు మూసివేయాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందన్నారు. హత్యలు ఆత్మహత్యలతో రాష్ట్రం మర్డర్ల రాష్ట్రంగా మారిందన్నారు. కాలేజిలకు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్క సొంత భవనం కూడా నిర్మించలేదని విమర్శించారు. గ్రామ పంచాయితీలకు, మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వకుంటే అభివృద్ధి ఎలా జరుగుతుందని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/