ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిరసన దీక్ష రద్దు ..

jagga reddy
jagga reddy

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈరోజు ఇందిరాపార్క్​ వద్ద నిరసన దీక్ష చేపట్టబోతున్నాని తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ దీక్ష ను రద్దు చేసుకున్నారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 10వ తేదీ వరకు ఎలాంటి పబ్లిక్ మీటింగ్స్, సమావేశాలు నిర్వహించడానికి లేదంటూ దీక్షకు అనుమతి ఇవ్వలేదు పోలీసులు. దీంతో జగ్గారెడ్డి దీక్ష ను రద్దు చేసుకున్నారు. తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగారెడ్డి నియోజకవర్గం, జిల్లాలోని గ్రామపంచాయతీ పరిధిలోని ఇల్లీగల్ లేఔట్స్‌, ఇళ్ల నిర్మాణాలను ఎల్‌ఆర్‌ఎస్ మరియు బీఆర్ఎస్‌ ద్వారా క్రమబద్దీకరణ చేయాలన్న డిమాండ్‌తో దీక్షకు ప్లాన్‌ చేశారు.. అయితే, పోలీసులు జగ్గారెడ్డి నిరసన దీక్షకు అనుమతి ఇవ్వలేదు.

రెండు రోజుల క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జగ్గారెడ్డి లే ఔట్లను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లోనూ ఇళ్లు, స్థలాలు క్రమబద్ధీకరించాలని సూచించారు. నిర్మాణం పూర్తయిన వాటిని కూల్చడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ప్రజలు లక్షల రూపాయలు అప్పు చేసి ఇల్లు నిర్మించుకుని ఉంటారని.. ప్రజల కోణంలో ఆలోచించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. సంగారెడ్డి జిల్లాలోని గ్రామపంచాయతీల్లో అక్రమ ప్లాట్లు, ఇళ్లను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.