మెదక్‌ జిల్లా నీళ్లకోసం సిఎంను కలుస్తాను

Jagga Reddy , CM KCR , Singur Water ,
Jagga Reddy , CM KCR , Singur Water ,

హైదరాబాద్‌: సంగారెడ్డి ఎమ్యెల్యె జగ్గారెడ్డి శుక్రవారం సీఎల్పీలో మీడియాతో మాట్డాతు… సిఎం కెసిఆర్‌ను సింగూరు నీళ్లకోసం కలిసి విజ్ఞప్తి చేస్తానని ఆయన అన్నారు. ఉమ్మడి మెదక్‌జిల్లాకు తాగునీరు కరువైందని, సింగూరును నీళ్లతో నింపి ప్రజలను ఆదుకోవాలని కోరుతానని చెప్పారు.నిబంధనల ప్రకారం సింగూరు జలాశయం నుంచి సంగారెడ్డికి 1 టీఎంసీ నీరు ఇవ్వాల్సి ఉన్నదని చెప్పారు. సింగూరు నీళ్ల కోసం ఈ నెల 18 నుంచి సంగారెడ్డిలో రిలే నిరాహారదీక్ష చేస్తానని తెలిపారు.