పెద్ద మనసు చాటుకున్న జగపతి బాబు

సినిమాల్లో విలన్ రోల్స్ చేస్తూ అలరించే జగపతి బాబు..రియల్ లైఫ్ తన పెద్ద మనసును చాటుకున్నారు. ఒక పేద విద్యార్థిని చదువుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని భరించేందుకు ముందుకు వచ్చారు. సైదాబాద్ కు చెందిన జయలక్ష్మి డిగ్రీ చదువుతూనే సామాజిక సమస్యలపై యుద్ధం చేస్తుంది. ఈమె తల్లిదండ్రులు ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించే పారిశుద్ధ్య కార్మికులు.

తాను చేస్తున్న కార్యక్రమాలకు గాను జయలక్ష్మి గతంలో బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ నుంచి ‘డే ఆఫ్ ది గర్ల్ ఛాలెంజ్’ రన్నరప్ పురస్కారం, ఛేంజ్ మేకర్ అవార్డులను అందుకుంది. మరోవైపు సివిల్స్ ను సాధించడమే లక్ష్యంగా ఆమె కష్టపడుతుంది. ఇలా ఆమె సాధించిన విజయాల గురించి ఓ టీవీ ఛానల్ లో కథనం ప్రసారమయింది. ఈ కథనాన్ని చూసిన జగపతిబాబు తల్లి ఆ అమ్మాయికి ఏదైనా సాయం చేయాలని చెప్పారు. దీంతో జయలక్ష్మిని జగపతిబాబు పిలిచి మాట్లాడారు. సివిల్స్ శిక్షణకు అవసరమైన ఆర్థిక సాయం చేస్తానని ఆమెకు జగపతిబాబు హామీ ఇచ్చారు. ఈ వార్త తెలిసి అభిమానులంతా జగపతి బాబు ఫై ప్రశంసలు కురిపిస్తున్నారు.