జగన్ పులివెందుల పర్యటన వాయిదా

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటన వాయిదా పడింది. ఆయన రేపు పులివెందుల వెళ్లి, 21వ తేదీన తాడేపల్లి తిరిగి రావాలని భావించారు. కానీ ఇప్పుడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 21, 22 తేదీల్లో జరగనున్న క్రమంలో జగన్ తన పర్యటన ను వాయిదా వేసుకున్నారు. ముందుగా ఈ నెల 24వ తేదీ నుంచి సమావేశాలు నిర్వహించాలని భావించిన ప్రభుత్వం తాజాగా మార్పు చేస్తూ ఈనెల 21, 22 తేదీల్లో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుంది.

ప్రమాణ స్వీకారంతో పాటు రెండు రోజుల సభ లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నికతో పాటు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు పేరు ఇప్పటికే ఖరారయిన నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ ఎవరికి ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ సమావేశాలు ముందుకు జరపడంతో జగన్ రేపటి తన పులివెందుల పర్యటనను వాయిదా వేసుకున్నారు.