జగన్ కడప పర్యటన రద్దు

ముఖ్యమంత్రి జగన్ కడప పర్యటన రద్దయింది. కడప విమానాశ్రయం పరిసరాల్లో పొగమంచు దట్టంగా ఉండడంతో ఎయిర్ ట్రాఫిక్ క్లియరెన్స్ లభించలేదు. ఎయిర్ ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం చాలాసేపు వేచి చూసినా, వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం జగన్ తన పర్యటన రద్దు చేసుకున్నారు. అమీన్ పీర్ దర్గా వద్ద ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

ఈ క్రమంలో నేడు సీఎం జగన్ దర్గాకు వెళ్లి చాదర్ ను సమర్పించడానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అలాగే ఈ మధ్యాహ్నం ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి కుమార్తె పెళ్లి రిసెప్షన్ కు కూడా హాజరు కావాల్సి ఉంది. అయితే కడప విమానాశ్రయం పరిసరాల్లో పొగమంచు ఎంతకీ తొలగకపోవడంతో సీఎం పర్యటన రద్దయింది.