పెద్దగా ఇల్లు కట్టుకునే వారికీ తీపి కబురు అందించిన జగన్ సర్కార్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జగనన్న కాలనీల్లో పెద్ద ఇళ్లు కట్టుకోవాలని అనుకునే వారికీ గుడ్ న్యూస్ అందించారు. లబ్దిదారులకు రూ.3 లక్షల వరకు రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఒక్కో ఇంటికి రూ. 3 లక్షల చొప్పున జాతీయ బ్యాంకులు అందిస్తున్నట్లుగానే అతి తక్కువ వడ్డీకి రుణం అందించేలా మంత్రి రంగనాథరాజు ఏర్పాట్లు చేసి, ప్రయోగాత్మకంగా ఆచంట నియోజకవర్గంలో శ్రీకారం చుట్టారు. ఆయా సంస్థలు ఒక్కో లబ్ధిదారుడికి వారి అవసరాలను బట్టి రూ. లక్ష నుంచి రూ. 3 లక్షల వరకు రుణం అందించనున్నాయి. 5, 8, 10 సంవత్సరాల కాల వ్యవధిలో తీసుకున్న అప్పు, వడ్డీ కలిపి ప్రతి నెలా చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. ఈ హోం లోన్స్ విధానాన్ని ప్రణాళికా బద్ధంగా 13 జిల్లాల్లోనూ విస్తరిస్తామని మంత్రి శ్రీరంగనాథరాజు ప్రకటించారు.

జగనన్న కాలనీల్లో 350 చదరపు అడుగుల నిర్మాణం చేపట్టేందుకు రూ.1.80 లక్షల రుణాన్ని ప్రభుత్వం లబ్దిదారులకు అందిస్తోంది. అయితే.. కొంత మంది ఇంకొంచెం పెద్ద ఇళ్ల నిర్మాణానికి మొగ్గుచూపుతూ బయట వ్యక్తుల వద్ద అధిక వడ్డీలతో రుణం తీసుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.