17వేల జగనన్నకాలనీల్లో 30లక్షల పక్కాఇళ్లు

మోడల్‌ హౌస్‌ను పరిశీలించిన సిఎం జగన్‌మోహన్‌రెడ్డి

CM YS Jagan Mohan Reddy inspecting a model house in TadePalli

Amaravati: పేదలందరికీ ఇళ్ల పథకం ద్వారా కేటాయించే ఇళ్లస్థలాల్లో హౌసింగ్‌ కార్పొరేషన్‌ నిర్మించిన మోడల్‌ హౌస్‌ను తాడేపల్లిలో బుధవారం సాయంత్రం రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించారు.

అర్హులైన పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చే దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది.

పేదలందరికీ ఇళ్ల పథకం ద్వారా 30లక్షల మంది అర్హులైన లబ్దిదారులకు ఇంటి స్థలానికి సంబంధించిన పట్టాలను అందజేయటంతోపాటు పక్కా ఇంటిని నిర్మించేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్దం చేయటం జరుగుతోంది..

ఈ క్రమంలో భాగంగా 17,000 వెఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో 30 లక్షల పక్కా ఇళ్లను నిర్మించటం లక్ష్యంగా ఉంది..

CM YS Jagan Mohan Reddy inspecting a model house in TadePalli

మొదటి విడతలో 15లక్షల ఇళ్లు, రెండో విడతలో 15 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టటం జరుగుతుంది.. పేదలకు నిర్మించే ఈ ఇళ్లు మంచి నాణ్యతతో, సౌకర్యవంతంగా ఉండే విధంగా ప్రణాళిక రూపొందించటం జరిగింది.

లివింగ్‌ రూమ్‌, ఒక బెడ్‌రూమ్‌,. కిచెన్‌, బాత్రూమ్‌, బయట వరండాతో మోడల్‌ హౌస్‌ను నిర్మించటం జరుగుతుంది.

CM YS Jagan Mohan Reddy inspecting a model house in TadePalli

గృహనిర్మాణశాఖ మంత్రి, గుంటూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, మంత్రులు కొడాలినాని, మేకపాటి గౌతమ్‌రెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గృహనిర్మాణ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్ జైన్, హౌసింగ్‌ కార్పొరేషన మేనేజింగ్‌ డైరెక్టర్‌ నవీన్‌కుమార్‌, గుంటూరుజిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌, జెసి పి.ప్రశాంతి, హౌసింగ్‌ ప్రాజెక్టు డైరెకట్ర్‌ వేణుగోపాలరావు, తాడేలప్లి మండల తహశీల్దార్‌ శ్రీనివాసరెడ్డి, మునిసిపల్‌ కమిషన్‌ రవిచంద్రరెడ్డి, రెవెన్యూ, మునిసిపల్‌, గృహనిర్మాణ శాఖాధికారులు పాల్గొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/