జగన్‌ వెంటే జనం నడుస్తున్నారు

Jeevitha-Rajasekha
Jeevitha-Rajasekha

హైదరాబాద్‌: జీవితా రాజశేఖర్‌ దంపతులు వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌సిపిలో చేరారు. అనంతరం జీవితా రాజశేర్‌ మీడియాతో మాట్లాడారు. ఏపి అభివృద్ధి చెందాలంటే జగన్‌ సీఎం కావాలన్నారు. గతంలో జగన్‌తో విభేదాలు ఉన్న మాట వాస్తమేనని, అప్పుడున్న జగన్‌ వేరు.. ఇప్పుడున్న జగన్‌ వేరు అని వారు పేర్కొన్నారు. మొత్తానికి వైఎస్సార్‌సీపీలో చేరడం సంతోషంగా ఉందని.. తిరిగి సొంతగూటికి వచ్చినట్లు ఉందన్నారు. జగన్‌ జనం వెంటే నడుస్తున్నారని, ఆయన పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్నారని తెలిపారు.

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/