రేపు స్వరూపానందస్వామిని కలవనున్న సిఎం జగన్‌

Jagan at Sarada Peetham
Jagan at Sarada Peetham


అమరావతి : ఏపి సిఎం జగన్‌ రేపు స్వరూపానంద స్వామిని ప్రత్యేకంగా కలవానున్నారు. రేపు సిఎం జగన్‌ విశాఖ పర్యటన ఖరారైందని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రేపు ముఖ్యమంత్రి విశాఖ చేరుకొని స్వరూపానంద స్వామిని ప్రత్యేకంగా కలవనున్నారు. అనంతరం తిరిగి అమరావతి చేరుకోనున్నారు.మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేస్తున్న జగన్.. ముహూర్తంపై స్వామి సలహాలు, సూచనలు తీసుకోనున్నారని తెలుస్తోంది. అంతేకాక జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తాన్ని కూడా స్వరూపానంద పెట్టారు. దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత జగన్, స్వరూపానందను కలవలేదు. ఈ నేపథ్యంలో ఆయన్ను కలిసి కృతజ్ఞతలు తెలియజేయాలని జగన్ నిర్ణయించుకున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/