రేపు ఢిల్లీ కి వెళ్లబోతున్న ముఖ్యమంత్రి జగన్

cm jagan – pm modi

రేపు సోమవారం ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ కి వెళ్లబోతున్నారు. ఈ మేర‌కు ప‌ర్య‌ట‌న ఖ‌రారు అయింది. ప్ర‌ధాని మోడీ, కేంద్ర‌హోంమంత్రి అమిత్‌షాల‌తో పాటు మ‌రికొంద‌రు కేంద్ర మంత్రుల‌తో జ‌గ‌న్ భేటీ కానున్న‌ట్టు తెలిసింది. రాష్ట్రానికి సంబంధించిన కొన్ని స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌ధానితో పాటు కేంద్ర పెద్ద‌ల‌తో చ‌ర్చించేందుకు జ‌గ‌న్ వెళ్ల‌నున్న‌ట్టు స‌మాచారం.

పోలవరం కు సవరించిన అంచనాలు.. ప్రాజెక్ట్ లు , జలవివాదాలు, ఇతర రాజకీయ అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి రుణపరిమితి సడలింపుల కోసం ఏపీ మంత్రులు..అధికారులు ఎన్నో రకాలుగా కేంద్రం వద్ద ప్రయత్నాలు చేసారు. కానీ, అనుమతి దక్కలేదు. ఈ సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన కీలంగా మారింది. ఇక జగన్ ఢిల్లీ పర్యటన అంటే టీడీపీ ఎక్కువ ఆసక్తి కనపరుస్తుంటుంది. ప్ర‌ధాని మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కావాల‌ని గ‌త మూడేళ్లుగా చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌య‌త్నాలేవీ స‌ఫ‌లం కాలేదు. అప్ప‌ట్లో త‌మ కార్యాల‌యాల‌పై దాడుల‌ను నిర‌సిస్తూ చంద్ర‌బాబు దీక్ష కూడా చేశారు. అనంత‌రం ఢిల్లీ వెళ్లి రాష్ట్ర‌ప‌తితో పాటు మ‌రికొంద‌రికి ఫిర్యాదు చేశారు. కేంద్ర‌హోంమంత్రిని క‌ల‌వాల‌ని చివ‌రి వ‌ర‌కూ ప్ర‌య‌త్నించినా, అటు వైపు నుంచి సానుకూల స్పంద‌న రాక‌పోవ‌డంతో తీవ్ర నిరాశ‌తో వెనుదిరిగారు. జ‌గ‌న్ విష‌యానికి వ‌చ్చే స‌రికి వెంట‌నే అపాయింట్‌మెంట్స్ ఇవ్వ‌డాన్ని టీడీపీ జీర్ణించుకోలేకుంది. అందుకే జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న అంటే టీడీపీకి కోపం.