నేడు మూడు జిల్లాలో పర్యటించనున్న జగన్‌

Y.S. Jagan Mohan Reddy
Y.S. Jagan Mohan Reddy

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థులందరినీ ఒకేసారి ప్రకటించిన ఆయన.. ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు.మూడు రోజులుగా ఆయన పలు జిల్లాల్లో పర్యటనలు జరుపుతున్నారు. ఇందులో భాగంగానే నేడు మరో మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గంలోని టంగుటూరు, నెల్లూరు జిల్లాలోని కావలి, చిత్తూరు జిల్లాలోని పలమనేరులో జగన్‌ ప్రచారం చేయనున్నారు. ఈ మూడు చోట్ల జరిగే బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించనున్నారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/