రాబోయే 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా జగనే ఉంటారు

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉంటారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో టిడిపి కనుమరుగవుతుందన్నారు. చంద్రబాబువి తప్పుడు ఆలోచనలని ..సానుభూతి కోసం అరెస్టు చేయమంటున్నారని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్శించుకున్నారు. అనంతరం మంత్రికి తిరుమల ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/