తిరుపతి: శ్రీకృష్ణ నగర్ లో పర్యటిస్తున్న జగన్

అకాల వర్షాలతో రాయలసీమ ప్రాంతం అతలాకుతలమైంది. వేల ఎకరాలు నీట మునగగా..వందల ఇల్లులు వరదల్లో కొట్టుకుపోయాయి. దీంతో వందల సంఖ్యలో ప్రజలు రోడ్డున పడ్డారు. ప్రభుత్వమే వారిని ఆదుకోవాలని మొరపెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన చేపట్టారు. రెండో రోజు పర్యటనలో భాగంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఈరోజు జగన్ పర్యటించనున్నారు. ప్రస్తుతం తిరుపతిలోని కృష్ణానగర్‌ను సీఎం పరిశీలించారు. వరద బాధితులను పరామర్శించి.. వరదలకు దెబ్బతిన్న ఇళ్లను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వరద నష్టాలపై ఫోటో గ్యాలరీని సీఎం తిలకించారు.

ఇక గురువారం వైఎస్సార్‌ జిల్లా రాజంపేట మండలం పులపత్తూరు, ఎగువ మందపల్లె, దిగువ మందపల్లె గ్రామాల్లో, చిత్తూరు జిల్లా వెదళ్లచెరువు ఎస్టీ కాలనీలో పర్యటించారు. ధ్వంసమైన ఇళ్లు, వంతెనలను పరిశీలించారు. తొలుత పులపత్తూరులో కాలినడకన గ్రామం మొత్తం కలియదిరుగుతూ స్వయంగా బాధితులతో మాట్లాడారు. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు.