శ్రీవారిని దర్శించుకున్న జగన్‌

jagan
jagan

తిరుమల: వైఎస్‌ఆర్‌సిపి అధినేత, ఏపికి కాబోయే సిఎం వైఎస్‌ జగన్‌ ఈరోజు శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. జగన్‌కు టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో జగన్‌కు వేదపండితులు ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. జగన్‌తో పాటు విజయసాయిరెడ్డి, రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఉన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/