ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి పదేళ్లు.. జగన్ స్పందన
AP CM YS Jagan
అమరావతి: ఏపీలో యువజన శ్రామిక రైతు (వైఎస్ఆర్) కాంగ్రెస్ పార్టీ స్థాపించి నేటికి పదేళ్లు నిండాయి. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నారు. 11వ వసంతంలోకి అడుగుపెడుతోన్న వైస్సార్సీపీ ప్రస్థానాన్ని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వైస్సార్సీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘మహానేత ఆశయ సాధనే లక్ష్యంగా, విలువలు విశ్వసనీయతల పునాదులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకుంది. ఈ పదేళ్ల ప్రయాణంలో కష్ట సుఖాల్లో నాకు అండగా నిలిచిన ప్రజలకు, నాతో కలిసి నడిచిన నాయకులకు, నా వెన్నంటి ఉన్న కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అని జగన్ పేర్కొన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: