ఈరోజు తిరుమలకు జగన్..స్వామివారికి పట్టువస్త్రాల సమర్పించనున్నారు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకునోన్నారు. నేడు ఉత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడవాహన సేవ జరుగనుంది. అందులో భాగంగా శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్‌ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుమలకు వెళ్లనున్నారు. 3 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని , అక్కడి నుంచి తిరుపతి బర్డ్‌ ఆస్పత్రికి చేరుకుని.. అక్కడ నిర్మించిన శ్రీపద్మావతి చిన్న పిల్లల కార్డియాక్‌ సెంటర్‌ను ప్రారంభిస్తారు.

అనంతరం అలిపిరి వద్దకు చేరుకుని శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు నడక మార్గం, పై కప్పును, గోమందిరాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం తిరుమలలోని బేడి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని స్వామి దర్శనం చేసుకుంటారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. స్వామివారి దర్శనం అనంతరం ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత పద్మావతి వసతి గృహానికి చేరుకొని రాత్రి అక్కడే బసచేస్తారు. మంగళవారం తిరిగి వేంకటేశ్వరుని సేవలో పాల్గొననున్న సీఎం ..ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానల్స్‌ను కర్ణాటక ముఖ్యమంత్రితో కలిసి ప్రారంభిస్తారు. ఆలయ సమీపంలో నిర్మించిన లడ్డు బూందీ పోటునూ ప్రారంభిస్తారు.