రేపు తిరుపతి లో సీఎం జగన్ పర్యటన

ఏపీ సీఎం రేపు గురువారం తిరుపతి లో పర్యటించబోతున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌ కు సంబదించిన షెడ్యూల్ ను రాష్ట్ర సర్కార్ విడుదల చేసింది. పర్యటన లో భాగంగా తిరుప‌తిలో ఏర్పాటు చేయ‌నున్న‌ జ‌గ‌నన్న విద్యా దీవెన కార్య‌క్ర‌మంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ల‌బ్ధిదారులు, వారి త‌ల్లిదండ్రుల‌తో సీఎం మాట్లాడి, అనంత‌రం అక్క‌డే ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న ప్రసంగిస్తారు.

ఇక షెడ్యూల్ కు సంబదించిన వివరాలు చూస్తే..రేపు ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలు డేరానున్న జగన్.. 11.05 గంటలకు తిరుపతి ఎస్‌వీ వెటర్నరీ కాలేజ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత 11.20 గంటలకు ఎస్‌వీ యూనివర్శిటీ స్టేడియం చేరుకుని ‘జగనన్న విద్యాదీవెన’ కార్యక్రమంలో పాల్గొని , అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభ లో ప్రసంగిస్తారు. ఆ తర్వాత 12.55 గంటలకు శ్రీ పద్మావతి చిల్డ్రన్స్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పటల్ కు చేరుకుంటారు. అక్కడ హాస్పటల్ భవన నిర్మాణానికి సంబంధించి భూమిపూజలో పాల్గొంటారు. అక్కడే ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం అక్కడి నుంచి టాటా కేన్సర్‌ కేర్‌ సెంటర్‌ (శ్రీ వెంకటేశ్వర ఇన్ట్సిట్యూట్‌ ఆఫ్‌ కేన్సర్‌ కేర్‌ అండ్‌ అడ్వాన్స్‌ రీసెర్చ్‌ హాస్పిటల్‌)కు చేరుకుని నూతన ఆసుపత్రిని ప్రారంభిస్తారు. కార్యక్రమం అనంతరం 2.25 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 3.35 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఇక సీఎం షెడ్యూల్ కు సంబదించిన అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. నిన్న మంత్రి రోజా ఈ పనులను దగ్గర ఉండి పరిశీలించడం జరిగింది.