జగన్ కీలక నిర్ణయం..వారందరికీ ‘ఫ్రీ’ భూములు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేదల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ లే ఔట్ల నిర్మాణంలో.. క‌చ్చితంగా పేదల ఇళ్ల కు ఐదు శాతం భూమి ఇవ్వాల‌ని ఆదేశాలు జారీచేశారు. ప్రైవేట్ లే ఔట్ల నిర్మిస్తే ఐదు శాతం భూమిని జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని జగన్ ఉత్తర్వులు ఆదేశించారు.

నిర్మించే లే ఔట్లో భూమిని ఇవ్వలేకుంటే.. 3 కిలో మీటర్ల పరిధిలో అంతే విస్తీరణం గల భూమిని ప్రభుత్వానికి అప్ప జెప్పాలని ఆదేశాలు ఇచ్చారు. భూమి కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో భూమి విలువను చెల్లించవచ్చని ప్రభుత్వం సూచనలు చేసింది. లే ఔట్ల డెవలపర్ల ద్వారా వచ్చే భూమిని.. నగదును పేదల కోసం నిర్మించే జగనన్న కాలనీలకు వినియోగించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం ప్రతి లే అవుట్‌లో సామాజిక అవసరాల కోసం కేటాయిస్తున్న 10శాతం స్థలానికి ఈ 5శాతం అదనంగా కేటాయించాలి.