పింఛను అర్హత వయసు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ

jagan
jagan

అమరావతి: ఏపిలో నిన్న సియంగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్‌ నేడు వైఎస్‌ఆర్‌ పింఛను పథకాన్ని ప్రారంభించింది. ఎన్టీఆర్‌ భరోసా పేరును మార్చి వైఎస్‌ఆర్‌ పింఛను కానుక అని పెట్టారు. పింఛనును రూ. 2250 లకు పెంచుతున్నట్లు సియం జగన్‌ ఇచ్చిన తొలి హామీకి శ/క్రవారం నాడు జీవో విడుదల చేసింది. జూన్‌ 1 నుంచి కొత్త పింఛను పథకం అమలులోకి రానుంది. వికలాంగులకు రూ. 3 వేలు, కిడ్నీ వ్యాధితో దయాలసిస్‌ చేయించుకుంటున్న బాధితులకు రూ.10 వేలు పింఛనుగా ఇవ్వనున్నారు. వృద్ధాప్య పింఛనుకు అర్హత వయసును 65 నుంచి 60 ఏళ్లకు కుదిస్తూ ఏపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ఈ పింఛను మొత్తాన్ని జులై 1 నుంచి ఆందించనున్నారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/