నేడు సిఎం కెసిఆర్‌తో జగన్‌ భేటి

kcr, Jagan
kcr, Jagan

హైదరాబాద్‌: వైఎస్‌ఆర్‌సిపి పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ఈరోజు తెలంగాణ సిఎం కెసిఆర్‌ను
హైదరాబాద్‌ లో కలవనున్నారు. ఈనెల 30న జరిగే తన ప్రమాణస్వీకారానికి హాజరుకావాలని కెసిఆర్‌ను జగన్‌ ఆహ్వానించనున్నారు. అమరావతిలో ఈరోజు 10.31 గంటలకు
వైఎస్‌ఆర్‌సిపి శాసనసభా పక్ష సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు. అనంతరం జగన్ హైదరాబాద్‌కు చేరుకుని రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలువనున్నారు. తర్వాత ఆయన సీఎం కేసీఆర్‌తో సమావేశం అవుతారు.


మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/