నవ్యాంధ్ర నూతన గవర్నర్‌కు ఫోన్‌ చేసిన జగన్‌!

Y S jagan
Y S jagan, ap cm

అమరావతి: నవ్యాంధ్రకు గవర్నర్‌గా బిజెపి సీనియర్‌ నేత, ఒడిశాకు చెందిన బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను నియమిస్తూ నిన్న రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం నూతన గవర్నర్‌కు ఏపి సియం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌ చేసి మాట్లాడారు. ఆయనకు శుభాభినందనలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి సహాయ సహకారాలను సంపూర్ణంగా అందించాలని బిశ్వభూషణ్‌ను కోరారు. మీతో భేటికి ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. కాగా, ఉమ్మడి ఏపి విడిపోయి ఐదేళ్లు దాటినా గవర్నర్‌గా నరసింహన్‌ కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు ఏపికి నూతన గవర్నర్‌ రావడంతో నరసింహన్‌ తెలంగాణకు మాత్రమే పరిమితం కానున్నారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/