తండ్రికి నివాళి అర్పించిన సిఎం జగన్

ఇడుపులపాయ: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఉదయం ఏపి సిఎం జగన్ గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో 8.30కి కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఆయన వెంట కుటుంభ సభ్యులు విజయమ్మ,భారతి,షర్మిళ, బ్రదర్.అనిల్ కుమార్ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి,కడప ఎంపీ అవినాష్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు ఉన్నారు. కాగా జగన్ ఇడుపులపాయలో పర్యటించనున్నారు. గండి ఆంజేనేయస్వామిని దర్శించుకొని ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన చేయనున్నారు. అక్కడి నుంచి జమ్మలమడుగులో నిర్వహించే కార్యక్రమంలో సీఎం జగన్ పెరిగిన పింఛను పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/