జగన్ పాస్ బుక్స్ వెనక్కు

జగనన్న భూ రక్షణ పథం పేరిట ..జగనన్న భూహక్కు పత్రంపై మాజీ సీఎం జగన్ ఫోటోతో పట్టాదార్ పాస్ పుస్తకాలను ప్రభుత్వం వెనక్కు తీసుకుంటుంది. సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు ఫైల్ పై సంతకం చేశారు. కేబినేట్ కూడా ఆమోదం తెలిపింది. అంతలోనే రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్.. వేగిరంగా స్పందించారు. రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. అందులో లోటుపాట్లను గ్రహించి.. తక్షణమే మాజీ సీఎం జగన్ ఫొటోతో పంపిణీ చేసిన 20.19 లక్షల పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు. ఈ పట్టాదార్ పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకునే పనిని రెవెన్యూ అధికారులు ప్రారంభించారు.

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ముందు జగన్ ప్రభుత్వం రూ. 20.19 లక్షల భూహక్కు పత్రాలను పంపిణీ చేసింది. మరో లక్ష పుస్తకాలు పంచాలి. ఈ నేపథ్యంలో పంపిణీ చేసిన వాటిని వెనక్కి తీసుకుని, ఉన్నవాటిని నిలిపి వేసి కొత్తగా డిజైన్ చేసి అధికారిక ముద్రతో పంపిణీ చేయనున్నారు. అలాగే, గత ప్రభుత్వం. జగనన్న సర్వే రాళ్లను తొలగించి కొత్త సర్వే రాళ్లను పాతరేస్తారు.