వైద్యం, ఆరోగ్యంపై సమీక్ష జరుపుతున్న జగన్‌

jagan mohan reddy
jagan mohan reddy

అమరావతి: ఏపి సియం జగన్‌మోహన్‌రెడ్డి ఈ రోజు వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సియం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో రాష్ట్రంలో వైద్యరంగంలో అనుసరిస్తున్న సంస్కరణలపై అధికారులతో జగన్‌ చర్చించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు, మౌలిక వసతులపై ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. ఎన్టీఆర్‌ వైద్య సేవ పేరును వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీగా మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సమీక్షకు సిఎస్‌ సుబ్రమణ్యం, ప్రభుత్వ సలహాదారు అజ§్‌ు కల్లం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రమేశ్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/