ఏపీని వదిలిపెడుతున్న జగన్ మోహన్ రెడ్డి..కారణం అదేనట

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాల్గు రోజుల పాటు రాష్ట్రానికి దూరంగా ఉండబోతున్నారు. ఈ నెల 28న జగన్- వైఎస్ భారతిరెడ్డిల 25వ పెళ్లి రోజు సందర్భాంగా కుటుంబ సభ్యులు వివాహ వేడుకను డెహ్రాడూన్ ప్రాంతాల్లో జరుపుకునేందుకు రేపు బయలుదేరుతున్నారు.

గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి జగన్ తన ఫ్యామిలీతో కలిసి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, మధ్యాహ్నం ఒంటి గంటకు చండీగఢ్‌కు ప్రయాణం అవుతున్నారు. 4 గంటలకు సిమ్లాలోని ఒబెరాయ్ హోటల్‌కు చేరుకోనున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి 4 రోజుల పాటు సిమ్లా లేదా డెహ్రాడూన్ ప్రాంతాల్లో గడిపేలా ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే టూర్ కు సంబదించిన అన్ని షెడ్యూల్స్ సిద్ధం చేసుకున్నారు. మొత్తం మీద ఓ నాల్గు రోజులు జగన్ రాష్ట్రాన్ని విడనున్నారు.