నితిన్‌ గడ్కరీతో సమావేశమైన జగన్‌

Jagan - Nitin Gadkari
Jagan – Nitin Gadkari

న్యూఢిల్లీ: ఏపి సిఎం జగన్‌ రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతోనూ సమావేశమయ్యారు. దాదాపు గంట పాటు కొనసాగిన ఈ భేటీలో రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిపై కీలకంగా చర్చించినట్టు సమాచారం. జగన్‌ వెంట ఎంపీ విజయసాయి రెడ్డి తదితరులు ఉన్నారు. అంతకముందు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో జగన్‌ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.


తాజా నాడీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health