ప్రధాని మోడితో సమావేశమైన జగన్‌

Jagan, Narendra Modi
Jagan, Narendra Modi

న్యూఢిల్లీ: వైఎస్‌ జగన్‌ ప్రధాని నరేంద్రమోడితో సమావేశయ్యారు. ఈరోజు ఉదయం బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న జగన్‌ నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లారు. సారత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన మోడికి జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా ప్రధానిని జగన్‌ ఆహ్వానించారు. అంతేకాక ఈ సమావేశంలో రాష్ట్రంలోని పరిస్థితులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సాయంవంటి అంశాల్ని జగన్‌ ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. జగన్‌తో పాటు రాజమహేంద్రవరం, బాపట్ల ఎంపీలు మార్గాని భరత్‌, నందిగం సురేశ్‌తోపాటు ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం మోడిని కలిశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/