ప్రమాణస్వీకారం రోజు జగన్‌ కీలక ప్రకటనలు?

Jagan
Jagan

అమరావతి: వైఎస్‌ జగన్‌ ఏపి సిఎంగా ప్రమాణస్వీకారం చేసే రోజున కొన్ని కీలకమైన ప్రకటనలు చేసేందుకు జగన్‌ సిద్దమౌతున్నారు. అయితే నవరత్నాలతో పాటు ఆర్థికంశాల్లో క్రమశిక్షణ విషయమై ఆయన ప్రకటన చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా నిన్న జగన్‌తో సుదీర్ఘంగా సమావేశమయిన అజయ్ కల్లాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు వివిధ శాఖలకు సంబంధించిన తీసుకోవాల్సిన కొత్త నిర్ణయాలపైనా చర్చించినట్లు సమాచారం.

మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా శాఖల వారీగా సంక్షిప్తంగా సమాచారాన్ని జగన్‌కు ఇచ్చారు. ప్రత్యేకించి పోలవరం ప్రాజెక్టులో ఇప్పటివరకూ ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం ఎంత? ఇంకా కేంద్రం నుంచి ఎంత రావాల్సి ఉంది? ఎంతమేరకు పనులు పూర్తయ్యాయన్న అంశాలను సీఎస్ వివరించినట్టు సమాచారం.


తాజా క్రీడ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/