పవర్‌ ప్రాజెక్ట్‌ త్రీడీ మోడల్‌ నమూనాను ప్రారంభించిన జగన్ ..

YouTube video
Hon’ble CM will be Participating in First Concrete Pour Ceremony of Greenko at Kurnool Dist. LIVE

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓర్వకల్లు మండలం గుమ్మితం తాండాలో పవర్‌ ప్రాజెక్ట్‌ త్రీడీ మోడల్‌ నమూనాను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును గ్రీన్ కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మిస్తోంది. 5,230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఒకే యూనిట్ నుంచి సోలార్, విండ్, హైడల్ పవర్ (పంప్డ్ స్టోరేజ్) ను ఉత్పత్తి చేయనుండటం ఈ ప్రాజెక్టు విశేషం. ఒకే యూనిట్ నుంచి మూడు విభాగాల ద్వారా ఇన్ని మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్న తొలి ప్రాజెక్టు ఇదే కావడం గమనార్హం.

ఈ ప్రాజెక్టు ద్వారా 3 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్, 550 మెగావాట్ల విండ్, 1,680 మెగావాట్ల హైడల్ విద్యుత్ ను ఉత్పత్తి చేయబోతున్నారు. ప్రాజెక్టును ఐదేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం 4,766.28 ఎకరాల భూమిని కేటాయించింది. ఇప్పటికే 2,800 ఎకరాల భూమిని కంపెనీకి అప్పగించారు. ప్రైవేటుతో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలోనూ 33,240 మెగావాట్ల భారీ సామర్థ్యంతో పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రో పవర్‌ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉండే నీటి వనరులను ఉపయోగించుకుని పంప్డ్‌ హైడ్రో స్టోరేజీ, సౌర, పవన విద్యుత్‌ల కలయికగా ఈ అధునాతన ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తోంది.

రాష్ట్రంలో మొత్తం 29 చోట్ల వీటిని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా.. మొదటి దశలో గండికోట, చిత్రావతి, సోమశిల, ఓక్, కురుకుట్టి, కర్రివలస, యర్రవరంలో శ్రీకారం చుడుతోంది. మొత్తం ఏడుచోట్ల 6,600 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించే ఈ ప్రాజెక్టుల డీటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌) తయారవుతోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/