అభయహస్తం పథకానికి జగన్ తూట్లు పొడిచారు: డీఎల్ రవీంద్రారెడ్డి

వైయస్సార్ పేరును జగన్ చెడగొడుతున్నారు: డీఎల్ రవీంద్రారెడ్డి

అమరావతి : సీఎం జగన్ పై మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో కేవలం కొంత మందికి మాత్రమే న్యాయం జరిగిందని అన్నారు. ప్రజలందరూ జగన్ పాలనలో ఓడిపోయారని చెప్పారు. డ్వాక్రా మహిళలకు ఎంతో ఉపయుక్తమైన అభయహస్తం పథకానికి కూడా జగన్ తూట్లు పొడిచారని మండిపడ్డారు. విద్యా దీవెన వంటి ఎన్నో పథకాలు నిర్వీర్యమైపోయాయని చెప్పారు. ప్రతి పథకానికి వైయస్సార్ పేరు పెట్టి ఆయన పేరును చెడగొడుతున్నారని విమర్శించారు.

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జగన్ ఏది చెపితే దానికి తలలు ఊపుతూ అధికారులు సంతకాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి రైతును రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పద్ధతిని మార్చుకోకపోతే రానున్న ఎన్నికల్లో వైస్సార్సీపీకి ప్రజలు గుణపాఠం చెపుతారని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/