ప్రమాణ స్వీకారానికి చంద్రబాబుకు ఆహ్వానం

jagan, chandra babu
jagan, chandra babu

అమరావతి: ఏపికి ప్రస్తుతం కాబోయే సియం వైఎస్‌ జగన్‌..టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు ఫోన్‌ చేశారు. తన ప్రమాణ స్వీకారం ఈ నెల 30న జరగబోతుందని, ఆ కార్యక్రమానికి హాజరుకావాలని జగన్‌ చంద్రబాబుకు ఫోన్‌లోనే ఆహ్వానించారు. రాష్ట్రాభివృద్దికి విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయనకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
ఐతే ఈ నెల 30న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో జగన్‌ ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/