జగన్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌లో భాగమే

ktr
ktr

నర్సంపేట: టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ వరంగల్‌ గ్రామీణ జిల్లా నర్సంపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్‌షోలో కెటిఆర్‌ ప్రాసంగించారు. వైఎస్‌ జగన్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌లో భాగమేనని కెటిఆర్‌ స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో మమత, అఖిలేశ్‌, నవీన్‌ పట్నాయక్‌ తమతో కలిసి పనిచేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అంతేకాక వారందరి మద్దతుతోనే 150 ఎంపి స్థానాలు గెలుచుకుంటామని ఆయన అన్నారు. ఎన్డీయేకు 150 నుండి 160 సీట్లకు కంటే ఎక్కువ వచ్చే పరిస్థితిలేదని, కాంగ్రెస్‌కు 100 సీట్లు మాత్రమే వస్తాయి. కాంగ్రెస్‌, బిజెపి అంటే పడనోళ్లు చాలామంది ఉన్నారన్నారు. కాగా ఐదేళ్లలో తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదని ఆరోపించారు. పేద ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తామన్న మోడి ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. మాటలతో ఆకట్టుకోవడమే మోదీ పని అని కేటీఆర్‌ మండిపడ్డారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/