అసెంబ్లీ కి వెళ్లకుండా..పులివెందులకు వెళ్తున్న జగన్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిన్న శుక్రవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. నిన్న నూతన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఇంకా మరో ముగ్గురు చేయాల్సి ఉండగా..ఈరోజు వారితో ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయించనున్నారు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి. అలాగే… ఉ.11గం.కు ఏపీ అసెంబ్లీ స్పీకరుగా చింతకాయల అయ్యన్నపాత్రుడు పేరును ప్రకటించనున్నారు బుచ్చయ్య చౌదరి. కొత్త స్పీకరుగా అయ్యన్నపాత్రుడు బాధ్యతలు స్వీకరించనున్నారు. స్పీకర్ ఎన్నిక కార్యక్రమానికి దూరంగా ఉండాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.

ఈరోజు పులివెందులకు వెళ్తున్నారు. ఉదయం విజయవాడ నుంచి కడపకు చేరుకోనున్నారు. కడప ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన పులివెందులకు పయనం కానున్నారు. పులివెందులలోని బాకరాపురంలో ఉన్న తన నివాసం చేరుకోనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పులివెందులకు చేరుకుంటారు. భవిష్యత్ కార్యాచరణ పైన పులివెందుల నాయకులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. కాగా, ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి ఆయన సొంత నియోజకవర్గానికి వస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.