విజయవాడలో మున్సిపల్‌ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని , జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం శకటాల ప్రదర్శనను వీక్షించి.. ప్రసంగించారు.

స్వాతంత్ర పోరాటానికి నిలువెత్తు రూపం జాతీయ జెండా. పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా.. భారతీయుల గుండె అని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. జాతీయ జెండా మన స్వాతంత్రానికి, అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీక. సార్వభౌమత్వానికి, ఏకత్వానికి, దేశభక్తికి, మన ఆత్మగౌరవానికి ప్రతీక. వాదాలు వేరైనా దేశ స్వాతంత్రం గమ్యంగా పోరాడారు ఆనాటి యోధులు. వాళ్లను స్మరించుకుంటూ.. హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.