ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన పీఆర్సీని ప్రకటించాలి

పనికిమాలిన పీఆర్సీని ప్రకటించారు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

అమరావతి: పీఆర్సీ వ్యవహారం ఏపీ ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య అగాధాన్ని పెంచుతోంది. రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకతాటిపైకి వచ్చాయి. ఈరోజు మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసులు ఇవ్వబోతున్నాయి. చర్చలకు రావాలంటూ ఉద్యోగ సంఘాల నేతలకు మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని ఫోన్ చేసి ఆహ్వానించినప్పటికీ… ఈ ప్రతిపాదను ఉద్యోగ సంఘాల నేతలు తిరస్కరించారు. పీఆర్సీ నివేదికను బయట పెట్టాలని, తాజా జీవోలను రద్దు చేయాలని… ఇ తర్వాతే చర్చలకు వస్తామని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందిస్తూ… పీఆర్సీపై జగన్ ప్రభుత్వం ఏదో ఒకటి తేల్చాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తూ పనికిమాలిన పీఆర్సీని ప్రకటించడం దారుణమని అన్నారు. వెంటనే ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన పీఆర్సీని ప్రకటించాలని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/