నిరుద్యోగులకు జగన్ తీపి కబురు : పోలీస్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

ఏపీ సర్కార్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు తీపి కబురు తెలిపింది. వచ్చే ఏడాది పోలీస్ పోస్టులు భర్తీ చేసేలా చూడాలని ఉన్నతాధికారులకు ముఖ్యమంత్త్రి జగన్ ఆదేశించారు. దాంతో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త అని చెప్పాలి. దీంతో ఏపీలో నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ మరో శుభవార్త చెప్పింది. త్వరలోనే 670 జూనియర్ అసిస్టెంట్స్, మరో 190 అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తామని ఏపీపీఎస్సీ సెక్రటరీ పీఎస్‌ఆర్ ఆంజనేయులు తెలిపారు.
ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ..‘‘త్వరలోనే జూనియర్ అసిస్టెంట్స్, అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తాం. ఒక్కొక్కటిగా వివిధ శాఖలల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తాం. గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకణంపై ఏపీ హైకోర్టు తీర్పును గౌరవిస్తాము’’ అని తెలిపారు. అంతే కాకుండా 18 నెలల్లో 30 నోటిఫికేషన్ లు విడుదల చేశామని…3 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని వెల్లడించారు.