పెద్దమ్మ దగ్గర మాట నిలబెట్టుకున్న జగన్

ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లో జగన్ తర్వాతే ఎవరైన అని మరోసారి అనిపించుకున్నాడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఎన్నికల హామీలు మాత్రమే కాదు వరదబాధిత పర్యటనలో ఓ పెద్దమ్మకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. అసలు ఏంజరిగిందంటే..

ఇటీవల రాయలసీమ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఈ వర్షాలకు భారీఎత్తున ఆస్థి నష్టం , ప్రాణ నష్టం వాటిల్లింది. ఈ తరుణంలో వరదబాధితులను పరామర్శ చేసారు జగన్. వరద బాధితులను పరామర్శించేందుకు ఈ నెల 3న చిత్తూరు జిల్లా తిరుపతిలోని సరస్వతి నగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు జగన్‌తో సెల్ఫీ దిగేందుకు ముందుకు దూసుకువచ్చారు.

ఆ స‌మ‌యంలో విజయ అనే మ‌హిళ‌ సెల్‌ఫోన్‌ జారి కాలువలో పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన జగన్‌ ‘పెద్దమ్మా, మీకు కొత్త ఫోన్‌ ఇప్పించే బాధ్యత నాది. బాధపడవద్దు’ అని హామీ ఇచ్చారు. ఆయ‌న చెప్పిన మాట‌ల‌ను కూడా విజ‌య మ‌ర్చిపోయింది. అయితే, సీఎం ఆదేశాలతో తిరుపతి కార్పొరేషన్‌ కమిషనర్‌ పీఎస్‌ గిరీష కొత్త సెల్‌ఫోన్‌ను డాక్టర్‌ రవికాంత్‌ ద్వారా విజ‌య‌కు అందజేశారు.

దీంతో విజ‌య స్పందిస్తూ… త‌న‌ను ఓదార్చడానికి జగన్ బాబు అలా చెప్పారనుకున్నాన‌ని వ్యాఖ్యానించింది. నిజంగానే ఈ విష‌యాన్ని గుర్తుపెట్టుకొని సెల్‌ఫోన్‌ పంపిస్తారనుకోలేదని హ‌ర్షం వ్య‌క్తం చేసింది.