23 మందిని లాక్కుంటే.. వారికి 23 మందే మిగిలారు

jagan
jagan

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి శాసనసభ పక్ష నేతగా జగన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జగన్‌ పార్టీ నేతలనుద్దేశించి మాట్లాడారు. ప్రజల విశ్వాసం చూరగొని అధికారంలోకి వచ్చామని ఆయన తెలిపారు. ఏపిలో 50 శాతం ఓటింగ్‌ సాధించడం గొప్ప విషయమని జగన్‌ పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌సిపి నుండి చంద్రబాబు అక్రమంగా 23 మంది ఎమ్మెల్యెలను లాక్కున్నాడు. కానీ ఇప్పుడు టిడపిలో 23 మంది ఎమ్మెల్యెలు మాత్రేమే గెలిచారు. మే 23నే దేవుడు చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాడు. అన్యాయం, అధర్మం చేస్తే దేవుడు తప్పక శిక్షిస్తాడు. సుపరిపాలన, అభివృద్ధిపై దృష్టి పెడతాం. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా పరిపాలన అందిస్తాం. 2024లో మరింత మెజారిటీతో పార్టీ విజయం సాధించాలి. అని జగన్‌ అన్నారు.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/